వైసీపీలో చాలా రోజులుగా పదవుల కోసం పాకులాట జరుగుతోంది.మొన్నటి దాకా మంత్రుల మార్పులు, విస్తరణ పేరిట ఎంత హడావిడీ జరిగిందో అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పటికీ ఈ అంశం వైసీపీలో హాట్ టాపిక్ గానే ఉంది.ఇదిలా ఉండగానే.
ఇప్పుడు మరో అంశం తెరమీదకు వచ్చింది.దాంతో వైసీపీలో మళ్లీ పదవుల జాతర అన్న పరిస్థితి కనిపిస్తోంది.
పైగా కేవలం నలుగురికి మాత్రమే అవకాశం ఉండటంతో.ఆ నలుగురు ఎవరు అన్న అంశం ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది.
ఇందుకు కారణం ఏంటంటే.త్వరలోనే రాజ్యసభ పదవులు భర్తీ చేయనున్నారు.
మరికొద్ది రోజుల్లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి.దీంతో ఈ పదవులు పొందే అవకాశం ఎవరికి దక్కుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ ఖాళీ అవుతున్న వాటిల్లో వైసీపీ నుంచి కేవలం ఒక విజయసాయిరెడ్డి ఉన్నారు.ఇక మిగతా ముగ్గురు కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు.
అందులో టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సురేష్ ప్రభు ఉన్నారు.ఈ ముగ్గురి పదవి కాలం వచ్చే జూన్ నెలతో గడిచిపోతోంది.
అయితే ఈ నాలుగు సీట్లు కూడా అసెంబ్లీలో అత్యధిక మెజార్టీ సీట్లు ఉన్నటువంటి వైసీపీకే దక్కుతాయని తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు వైసీపీ నుంచి ఆ పదవులు దక్కించుకునే ఆ నలుగురు లక్కీ నేతలు ఎవరా అనే చర్చ మొదలైంది.
ఇక ఎలాగూ విజయసాయిరెడ్డి కచ్చితంగా ఉంటారు.ఒకవేళ ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును కోరుకుంటే మాత్రం.ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టేస్తే నలుగురికి బంపర్ ఆఫర్ దక్కుతుంది.అయితే ఈ సారి ముస్లింలకు, ఎస్టీలకు రెండు సీట్లు ఇస్తారని తెలుస్తోంది.
ఇంకొకటి బీజేపీ పెద్దలు కోరిన వారికి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.మిగిలిన ఒక్క సీటును మాత్రం ఏపీలో ఉన్న బీసీ వర్గాలకే ఇస్తారని ప్రచారం నడుస్తోంది.