సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం లో ఏం జరుగుతున్న కూడా మన ఇంట్లోనే ఉండి చూస్తున్నాం.చిన్న ఫోన్ తో ప్రపంచ నలుమూలల జరుగుతున్న విషయాలను తెలుసుకుంటున్నాం.
వాటిపై రియాక్ట్ కూడా అవుతున్నాం.ఈ సోషల్ మీడియా గత పది సంవత్సరాలలో మరింత ఎక్కువుగా వాడుతున్నారు.
ప్రతి ఒక్కరు తమ మొబైల్ లో సోషల్ మీడియా వాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే అందులో పోస్ట్ చేస్తూ తమ స్నేహితులకు కూడా తమ సంతోషాలను, దుఃఖాలను, తమ ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంటూ ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు.దానికి అనుగుణంగానే మన స్నేహితులు, ఫాలోవర్లు కూడా రియాక్ట్ అవుతున్నారు.
ఇక కరోనా ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగిందనే చెప్పాలి.సాధారణ ప్రజల నుండి రాజకీయ నేతలు, మంత్రులు, సినీ సెలెబ్రిటీలు ఇలా ప్రతి ఒక్కరు ప్రతి రోజు సోషల్ మీడియాలో ఒకటి అయినా ట్విట్టర్ లో అందుబాటులో ఉంటున్నారు.
ఎలాంటి సమస్యలు వచ్చిన అధికారులు కూడా వెంటనే స్పందించి తమకు చేతనైన సహాయం చేస్తున్నారు.
తాజాగా యూపీలోని సుల్తాన్ పూర్ కు చెందిన మహిళా ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసే సమయంలో తన 8 నెలల చిన్నారి పాలకోసం గుక్కపట్టి ఏడిపించి.తనని ఎంత ఉరుకోబెట్టిన ఫలితం లేకపోవడంతో పాప ఏడుస్తుంది.పాలు కావాలని చెప్పి రైల్వే శాఖకు ట్వీట్ చేసింది.
వెంటనే స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ పాపకు పాలు అందివ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో భీమసేన్ స్టేషన్ నుండి రైలు బయలుదేరి కాన్పూర్ స్టేషన్ కు చేరుకునే సరికి అధికారులు పాప తల్లికి పాలు అందించారు.దీంతో ఆమె వెంటనే రైవే అధికారులకు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ కు ధన్యవాదములు చెప్పింది.