చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మీడియాకు, వివాదాలకు శ్రీజ దూరంగా ఉంటారు.
అయితే ఇన్ స్టాగ్రామ్ లో పేరు మార్చడం ద్వారా శ్రీజ వార్తల్లో నిలిచారు.కొన్నేళ్ల క్రితం శ్రీజ, కళ్యాణ్ దేవ్ కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగానే ఉన్నారు.వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలకు చెక్ పెట్టారు.
అయితే తాజాగా శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను శ్రీజ కళ్యాణ్ నుంచి శ్రీజ కొణిదెలగా మార్చారు.మరోవైపు గత కొన్ని నెలల నుంచి శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ దేవ్ ఫోటోలను పోస్ట్ చేయడం లేదు.
కొన్ని నెలల క్రితం సమంత కూడా అక్కినేని పేరును తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించి ఆ తర్వాత నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు.శ్రీజ కూడా పేరును తొలగించడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం గమనార్హం.
కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సంక్రాంతి కానుకగా విడుదలైనా ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.అటు కళ్యాణ్ దేవ్, ఇటు మెగా హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేయలేదనే సంగతి తెలిసిందే.శ్రీజ లేదా కళ్యాణ్ దేవ్ స్పందిస్తే వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలిసే ఛాన్స్ ఉంది.
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేరును మార్చడం గురించి శ్రీజ వివరణ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా తొలి వీకెండ్ లో కేవలం 30 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.కళ్యాణ్ దేవ్ నటించిన తొలి సినిమా విజేత ఫ్లాప్ కాగా రెండో సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.సమంత దారిలో శ్రీజ విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.