ఇంటర్నెట్ వినియోగం పెరిగాక మ్యూజిక్ వీడియోలు ఖండాంతరాలు దాటుతున్నాయంటే అతిశయోక్తి కాదు.ఒక పాట మంచిగా ఉంటే చాలు అది ప్రపంచంలోని ప్రతి మూలాకి చేరిపోతూనే ఉంది.
ఇలాంటి పాపులర్ పాటలకు ఇతర దేశాల వారు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.ఇలా స్టెప్పులేసిన విదేశీయుల్లో ఇప్పటికే చాలా మంది పాపులర్ అయ్యారు.
ముఖ్యంగా బాలీవుడ్ పాటలకు లిప్ సింక్స్, డ్యాన్సులు చేస్తూ వైరల్ సెన్సేషన్ గా మారాడో టాంజానియా యువకుడు.ఇతడి పేరు కిలిపాల్.
ఈ యువకుడు kili_paul అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తుంటాడు.
ఇప్పటికే ఎన్నో ఇండియన్ పాటలకు డ్యాన్సులు చేసి మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైకులు సంపాదించాడు.
ఇప్పుడు ఏకంగా తెలుగు పాటకే అదరగొట్టే స్టెప్పులేసి ఆశ్చర్య పరుస్తున్నాడు.ఆ పాట మరేదో కాదు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని “నా స్వామి స్వామి”! దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ డూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వైరల్ అయిన వీడియో కిలిపాల్ ఒక సంప్రదాయ వేషధారణలో పుష్ప సినిమాలోని నా సామి సామి పాటకు స్టెప్పులు వేయడం చూడొచ్చు.
అచ్చం రష్మిక లాగానే అతడు కాళ్లు కదపడం చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు.కొద్ది సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో కిలిపాల్ దేవిశ్రీప్రసాద్ పాటకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపించింది.ఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైకులు వచ్చాయి.కిలిపాల్ ఈ వీడియో పోస్టులో అల్లు అర్జున్, రష్మిక మందాన, దేవిశ్రీ ప్రసాద్ లను ట్యాగ్ చేశాడు.
ఇండియాలో స్వామి స్వామి పాట సంచలనం సృష్టిస్తోందన్నట్లు అతడు ఈ పోస్టుకు ఓ క్యాప్షన్ జోడించడం విశేషం.ఒక తెలుగు పాట టాంజానియా వరకు చేరడం ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది.
దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.