వైసీపీని టెన్ష‌న్ పెడుతున్న 2022..

కొత్త సంవ‌త్సరం అంటే ఎవ‌రికైనా చాలా ఆశ‌లు ఉంటాయి.ఈ ఏడు ఎన్నెన్నో చేయాల‌ని, ఎన్నో సాధించాల‌ని అనుకుంటారు.

 2022 Putting Tension On Ycp . Ycp, Jagan, Ap Potics , Ap Govt , Schemes, Surveye-TeluguStop.com

కానీ 2022 సంవ‌త్సరం తెచ్చిన ఉత్సాహం మాత్రం వైసీపీలో కనిపించ‌ట్లేదు.ఆ పార్టీలో నేత‌లకు మాత్రం ఈ ఏడాది కొంచెం ఇబ్బందిక‌రంగా అనిపిస్తోందంట‌.

మ‌రి అలా ఎందుకు అనిపిస్తోంది అంటే ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే గ‌డిచిన ఏడాది ఎంతో వ్య‌తిరేక‌త వ‌స్తే.

ఈ ఏడాది కూడా మ‌రింత వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారంట పార్టీలోని నేత‌లు.

ఈ విష‌యం బ‌య‌టి వారు చెప్ప‌ట్లేదండోయ్‌.

ప్ర‌భుత్వ పెద్ద‌లు అత్యంత సీక్రెట్ గా నిర్వ‌హించిన సర్వేలో తేలిపోయింది.జ‌గ‌న్ పాల‌న స‌గం మేర పూర్త‌యిపోయింది.

జ‌గ‌న్ హ‌యాంలో అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకు వ‌చ్చింది.వీటిని అమ‌లు చేసేందుకు అప్పులు కూడా బాగానే చేస్తోంది.

అన్ని వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌థ‌కాలు తీసుకు వచ్చింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.మ‌రి ఇన్ని చేసిన త‌ర్వాత జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో అని స‌ర్వే చేస్తే పూర్తి భిన్న‌మైన ఫ‌లితాలు రావ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది.

సంక్షేమ ప‌థ‌కాల వ‌ర‌కే చాలు అన్న‌ట్టు ఉంది ప‌రిస్థితి.

అంటే మిగ‌తా విష‌యాల్లో జ‌గ‌న్ పాల‌న ఎలా ఉన్నా ప‌ట్టించుకోన‌ట్టు.కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి కాబ‌ట్టి అదే చాలు.అక్క‌డి వ‌ర‌కే జ‌గ‌న్ పాల‌న భేష్ అన్న‌ట్టు చెబుతున్నారు.

మిగ‌తా విష‌యాల్లో మాత్రం జ‌గ‌న్ పాల‌న‌కు ఎక్కువ మార్కులు వేయ‌ట్లేదు ప్ర‌జ‌లు.అయితే ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగానే ఉంద‌ని తెలుస్తోంది.

మ‌హిళ‌లు, వృద్ధులు మాత్రం జ‌గ‌న్‌కు ఓటేస్తున్నారు.కానీ మధ్య తరగతి అలాగే ఉన్నత వ‌ర్గాలు మాత్రం జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌ట్లేదు.

ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.పెరుగుతున్న ధ‌ర‌లు, అభివృద్ధి లేక‌పోవ‌డం లాంటివి ప్ర‌ధానంగా స‌మ‌స్య‌గా మారుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube