తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సిద్దాంతాలతో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం.బీఎస్పీ పార్టీలో చేరి బహుజనవాదాన్ని ప్రచారం చేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.
రాష్ట్ర స్థాయిలో ప్రవీణ్ కుమార్ తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే నేతలు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ప్రజల్లో పార్టీని సుస్థిర పరచడానికి తనదైన శైలిలో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగినా ఆ తరువాత ప్రవీణ్ కుమార్ స్పష్టతతో అవి అన్నీ పుకార్లు అని తేలిపోయాయి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంపై కాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠంగా ఉంటేనే ఎన్నికల్లో మిగతా బలమైన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనేది ప్రవీణ్ కుమార్ వ్యూహంలా అనిపిస్తోంది.
ఏఐతే స్వేరో పేరుతో ఒక సంస్థలాంటిది ఉండడంతో ప్రస్తుతం వారే బీఎస్పీ పార్టీకి బలమైన కార్యకర్తలుగా కొనసాగుతున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.అయితే బడా నేతలెవరూ ప్రవీణ్ కుమార్ పార్టీలో లేరు కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తారా లేక ఖరీదైన రాజకీయాలవైపు మళ్లుతారా అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.
అంతేకాక ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ పార్టీ కూడా మిగతా పార్టీలలా టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఏ ఒక్క పార్టీకి మద్దతి ఇవ్వకపోయినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఎజెండా మాత్రం తప్పక స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
మరి ఆ సమయంలో బీఎస్పీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారే అవకాశం వందకు వంద శాతం ఉంది.