హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో పాపులారిటీని సంపాదించుకున్న నటులలో వరుణ్ సందేశ్ ఒకరనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్ భార్య వితికా శేరుతో కలిసి పాల్గొన్నారు.
త్వరలో వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వరుణ్ సందేశ్ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన తండ్రి తనకోసం కష్టపడ్డారని వరుణ్ సందేశ్ అన్నారు.జీవితంలోనే నాన్న తనకు గైడ్ అని వరుణ్ చెప్పుకొచ్చారు.
ప్రతి ఫీల్డ్ లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందని తన తరపున తండ్రే వాటిని మోశారని వరుణ్ వెల్లడించారు.అలాంటి ఫాదర్ దొరకడం తన అదృష్టమని వరుణ్ పేర్కొన్నారు.
ఫాదర్ లేకపోతే అనే ఫీలింగ్ ను తాను తలచుకోలేనని వరుణ్ చెప్పుకొచ్చారు.ఫాదర్ వితికాను కూతురులా చూసుకుంటానని వరుణ్ పేర్కొన్నారు.
పడ్డానండి ప్రేమలో మరీ సినిమా సమయంలో తాను, వితిక ప్రేమలో పడ్డామని వరుణ్ చెప్పుకొచ్చారు.ఆ టైటిల్ కు తగ్గట్టు ప్రేమలో పడ్డానని వరుణ్ వెల్లడించారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్నిసార్లు ఆమె ఫీలైందని వరుణ్ పేర్కొన్నారు.వితిక కొన్ని మెసేజ్ లు చూపించిందని ఆ మెసేజ్ లను చూసి వాళ్లను ఏం అనాలో అర్థం కాలేదని వరుణ్ తెలిపారు.గంటసేపు మెసేజ్ లను చూసి అవతలి వ్యక్తుల క్యారెక్టర్ ను డిసైడ్ చేయకూడదని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.
రియాలిటీ షోలను చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని వరుణ్ అన్నారు.వితిక బయటకు వచ్చిన తర్వాత చాలా బాధ పడ్డారని వరుణ్ వెల్లడించారు.బిగ్ బాస్ షో తనను ఎఫెక్ట్ చేసిందని వరుణ్ పేర్కొన్నారు.
ఇంకా పిల్లలు లేరని వితికకు కొన్ని గోల్స్ ఉన్నాయని వరుణ్ అన్నారు.