సూపర్ స్టార్ మహేష్ ఏసియన్ సినిమాస్ కలిసి నిర్మించిన ఏ.ఎం.
బి సినిమా మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈమధ్య స్టార్ సినిమాలకి ప్రీమియర్స్ అక్కడే వేస్తున్నారు.
అంతేకాదు లేటెస్ట్ గా సినిమాలకు సంబందించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ కూడా అక్కడే చేస్తున్నారు.రీసెంట్ గా కొన్ని సినిమాలకు సంబందించిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ కు అక్కడే నిర్వహించారు.
అయితే ఈ చిన్న చిన్న ఈవెంట్స్ కోసం కూడా ఏ.ఎం.బి మాల్ భారీగానే ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది.
అయితే బంజారా హిల్స్ పివీఅర్ సినీ ప్లెక్స్ కన్నా ఏ.ఎం.బి మాల్ లో ఈవెంట్స్ కి తక్కువే ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తుంది.పి.వి.ఆర్ సినీ ప్లెక్స్ లో టీజర్, ట్రైలర్ ఈవెంట్స్ కోసం 2.5 లక్షల దాకా తీసుకుంటున్నారట.అయితే ఏ.ఎం.బి మాల్ లో మాత్రం అందుకు కేవలం 1.1 లక్ష మాత్రమే తీసుకున్నారట.సో ఓ రకంగా మహేష్ ఏ.ఎం.బి మాల్ బడ్జెట్ పరిధుల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది.ఏ.
ఎం.బి మాల్ లో ట్రైలర్, టీజర్ రిలీజ్ ఈవెంట్స్ తో కూడా రాబడి తెచ్చుకుంటున్నాడు మహేష్. సో ఎలా లేదన్నా మాల్ మెయింటైన్స్ లో భాగంగా ఈ రిలీజ్ ఈవీంట్స్ ఎమౌంట్ సపోర్ట్ చేస్తాయని చెప్పొచ్చు.







