టీడీపీ – జనసేన అభ్యర్థుల జాబితాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ( YCP ) ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందని తెలిపారు.
టీడీపీ – జనసేన కూటమికి ( TDP Janasena Alliance ) అభ్యర్థులు లేక వెతికి వెతికి పట్టారని విమర్శించారు.
టీడీపీ – జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిందని చెబుతున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ – జనసేన అభ్యర్థులను చూస్తుంటే వైసీపీ ఈసారి 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని స్పష్టం చేశారు.