కత్రినా నుంచి ఐశ్వర్య వరకు పెళ్లిలో ఏ హీరోయిన్ ఎంత ఖరీదైన బంగారం ధరించింది?

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.వారు తినే ఫుడ్డు నుంచి కట్టుకునే బట్ట వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా కాస్ట్లీ గా ఉంటాయి.

 Wedding Jewelery Of These Bollywood Celebrities Shilpa Shetty Priyanka Chopra Is-TeluguStop.com

ఇకపోతే హీరోయిన్ ల విషయానికి వస్తే.వీరు మామూలుగానే కోట్లు విలువ చేసే ఆభరణాలు, దుస్తులు, ధరిస్తూ వుంటారు.

అలాంటిది హీరోయిన్ ల పెళ్లి అంటే వారు ధరించే బట్టలు, ఆభరణాల విలువ అంచనా వేయడం కూడా చాలా కష్టం.ఇకపోతే ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ నుంచి ఐశ్వర్యారాయ్ వరకూ ఏ హీరోయిన్ పెళ్లిలో ఎంత ఖరీదైన బంగారు ఆభరణాలు ధరించారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే డిసెంబర్ 9న కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.ఈ పెళ్లి లో కత్రినా ధరించిన లెహంగా దర దాదాపుగా 17 లక్షలు అని తెలుస్తోంది.

అలాగే కత్రినా కైఫ్ ధరించిన డైమండ్ రింగ్ ధర ఏడు లక్షల 40 వేలు అని వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Telugu Katrina Kaif, Priyanka Chopra, Shilpa Shetty, Jewelery-Movie

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో మనందరికి తెలిసిందే.వీరి పెళ్లిలో ఐశ్వర్యారాయ్ బంగారు తీగతో తయారుచేసిన 75 లక్షలు విలువచేసే శారీనీ ధరించింది.పెళ్లి సమయంలో ఐశ్వర్యారాయ్ ధరించిన మొత్తం బంగారు ఆభరణాల విలువ దాదాపుగా 3.5 కోట్లు అని తెలుస్తోంది.

Telugu Katrina Kaif, Priyanka Chopra, Shilpa Shetty, Jewelery-Movie

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి 2017 లో జరిగిన విషయం తెలిసిందే.సబ్య సాచి అనే ఒక డిజైనర్ డిజైన్ చేసిన 45 లక్షల విలువచేసే లెహంగాను అనుష్క శర్మ ధరించింది.ఆమె పెళ్ళిలో ధరించిన మొత్తం ఆభరణాల విలువ మూడు కోట్లు అని సమాచారం.

Telugu Katrina Kaif, Priyanka Chopra, Shilpa Shetty, Jewelery-Movie

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ 2018 లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.ప్రియాంక చోప్రా తన పెళ్లిలో సబ్యసాచి డిజైన్ చేసిన లెహంగా ధరించడంతో పాటు, 3 నుంచి దాదాపుగా నాలుగు కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు వివాహసమయంలో ధరించింది.

Telugu Katrina Kaif, Priyanka Chopra, Shilpa Shetty, Jewelery-Movie

దీపికా పదుకొనే,రణవీర్ సింగ్ ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దీపికా పెళ్లి సమయంలో 20 లక్షలు విలువ చేసే మంగళసూత్రాన్ని ధరించింది.అంతేకాకుండా పెళ్లిలో ఆమె ధరించిన ఆభరణాల విలువ 1.5 కోట్లు విలువ చేసే బంగారాన్ని ధరించింది.

బాలీవుడ్ లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల పెళ్లి కూడా ఒకటి.శిల్పాశెట్టి తన పెళ్లిలో ధరించిన లెహంగా ఖరీదు అక్షరాల యాభై లక్షలు అని తెలుస్తోంది.

అలాగే ఆమె పెళ్లిలో ధరించిన రింగ్ దాదాపుగా 5 కోట్లు అని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube