వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి.. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల..

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన.వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు.

 Varun Sandesh 'induvadan' Censor Complete Worldwide Release On January 1 , Induv-TeluguStop.com

చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది.కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది.అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్.

విడుదలైన క్షణం నుంచే కంటెంట్‌కు మంచి స్పందన వస్తుంది.ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

U/A సర్టిఫికేట్ వచ్చింది.జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన.

ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube