కాంగ్రేస్ పార్టీ కీలక నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించటం ఒక తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక దేశ స్థాయిలో సంచలనం రేపింది.ఏకంగా ప్రధాని మోడీ కూడా రోశయ్య మరణం పట్ల స్పందించి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న రోశయ్య చివరిదాకా పార్టీలోనే కొనసాగటం జరిగింది.వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకంగా… రాణించిన రోశయ్య ఆర్థికమంత్రిగా.సంచలన నిర్ణయాలు తీసుకునేవారు.తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న రోశయ్య అసెంబ్లీ లో ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ..చాలా విషయాలలో ప్రత్యర్థులను సైతం ఒప్పించే సత్తా కలిగిన నైపుణ్యం కలిగిన నాయకుడిగా రాణించారు.
ఈ నేపథ్యంలో రోశయ్య ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.రోశయ్యకి హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈసందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీర్మానాన్ని కూడా తీర్మానించి దాన్ని సీఎం కేసీఆర్ కి పంపుతామని తెలిపారు.ఈ క్రమంలో రేపు గాంధీభవన్ లో… రోశయ్య కి ఘన నివాళి అర్పించటానికి ఏర్పాట్లూ చేస్తున్నారు.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు తెలియజేశారు.