అప్పుడప్పుడు మన కండ్లను కూడా మోసం చేసే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.వాటిని చూస్తే నిజంగానే మనం షాక్ కు గురవుతాం.
ఎందుకంటే ఇలాంటి ఘటనలు సృష్టిలో ఎప్పుడూ జరిగి ఉండవు.అందుకే వాటికి ఆదరణ కూడా అంతలా ఉంటుంది.
మనం అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని వింత వింత ఆకారాలు కనిపిస్తున్న వీడియోలు చూస్తున్నాం.ఎలాంటి సపోర్టు లేకుండా వింత ఆకారాలు కనిపించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
కొన్ని సార్లు అయితే పాములు కూడా ఇలా గాల్లో ఎగురుతున్నాయి.
అయితే అవి అలా ఎందుకు ఎగురుతున్నాయో చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.
అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల చల్ చేస్తోంది.దాన్ని చూస్తే హ్యారీపోటల్ సినిమాలో లాగే అనిపిస్తుంది.
ఆ సినిమాలో ఓ వ్యక్తి చీపురు మీద ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది.ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఓ చీపురు ఆకాశంలో ఎగురుతున్నట్టు ఈ వీడియోలో ఉంది.
ఈ వైరల్ వీడియో యూఎస్ లో తీశారని సమాచారం.అమెరికాకు చెందిన లుకా అనే డెలివరీ బాయ్ దీన్ని రికార్డు చేశాడు.
అతను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న క్రమంలో అతనికి ఆకాశంలో ఎగురుతున్న చీపురు కనిపించింది.దాన్ని చూసి షాక్ అయిన అతను వెంటనే తన ఫోన్ లో వీడియో తీశాడు.ఆ చీపురు ఎలాంటి ఆధారం లేకుండా ఉంది.మొదట దాన్ని చీపురు ఆకారంలో ఉన్న గాలిపటం అనుకున్నాడంట.
కానీ దానికి దారం కూడా లేకుండానే ఆకాశంలో ఎగురుతుండటం చూసి షాక్ అయిపోయారు.వెంటనే దాన్ని తన ఫోన్ లో వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు.
ఇంకేముంది దాన్ని చూసిన వారంతా అది దెయ్యం అని ఇంకొందరు ఏలియన్ అని ఇలా రకరకాల కామెంట్లు పెట్టేస్తున్నారు.
.