తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాల, అధికార పక్షం మాటల తూటాలతో, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కిన పరిస్థితి ఉంది.ఇక హుజూరాబాద్ లో భారీ మెజారిటీతో గెలిచి దూకుడు మీద ఉన్న బీజేపీ తాజాగా ఈటెల రాజేందర్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
తెలంగాణ గర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేసిన పరిస్థితి ఉంది.అయితే బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండటంతో టీఆర్ఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని చెప్పవచ్చు.
సాధ్యమైనంతవరకు ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వ అనుకూల భావన తెచ్చుకుంటే కాని భవిష్యత్ లో టీఆర్ఎస్ కు కొంచెం అనుకూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది.అయితే కేసీఆర్ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.
కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను చాలా వరకు ఎదుర్కొన్నప్పటికీ కొత్తగా ప్రస్తుత పరిస్థితులను అనుసరించి వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఇంకా రెండున్నర సంవత్సరాల ప్రభుత్వం ఉన్నదని, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని ఇంకా రానున్న రోజులు మనవేనని టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ అంతర్గతంగా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రతిపక్షాలు చాలా వరకు దూకుడుగా ముందుకెళ్తున్న సమయంలో అంతే దూకుడుగా టీఆర్ఎస్ ముందుకెళ్లకుంటే వెనకబడే అవకాశం ఉంటుంది.ప్రజల్లో టీఆర్ఎస్ పై చులకన భావన ఏర్పడి ఓటు వేయడానికి ఆసక్తి చూపించక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.కాని కేసీఆర్ మాత్రం హుజూరాబాద్ ఓటమి పట్ల సమీక్ష నిర్వహించుకున్న అనంతరం రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అనుసరించబోయే వ్యూహాన్ని టీఆర్ఎస్ నేతలకు తెలిపిన పరిస్థితి ఉంది.