హైదరాబాద్ నగర శివారులో పేకాట స్థావరాలపై పోలీసుల ఆకస్మికంగా దాడి చేశారు.ఈ క్రమంలోనే ఒక ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 20 మంది ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
అయితే ఆ ఫామ్ హౌస్ ఎవరిది అనే విషయాన్ని పోలీసులు ఆరా తీయగా ఆ ఫామ్ హౌస్ నటుడు నాగశౌర్య ఫామ్ హౌస్ అని తేలింది.ఈ ఫామ్ హౌస్ ను నాగశౌర్య గత ఐదు సంవత్సరాల నుంచి లీజుకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక ఆ ఫామ్ హౌస్ లో నుంచి అరెస్టు చేసిన వారి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ఇక నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పేకాటరాయుళ్లు ఇక్కడకు చేరుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఆకస్మికంగా పోలీసులు దాడి చేశారు.
ఈ క్రమంలోనే వీరిని అరెస్టు చేసిన పోలీసులు ఈ విషయం గురించి ఆరా తీయడంతో అది నాగసౌర్య ఫామ్ హౌస్ అని తేలింది.
ఈ క్రమంలోనే పోలీసులు ఈ పేకాటరాయుళ్లకు నాగశౌర్య మధ్య ఏదైనా సంబంధం ఉందా.అంటూ ఆరా తీస్తున్నారు.గత కొద్దిరోజుల క్రితమే హీరో కృష్ణుడు కూడా ఇలాగే పేకాటలో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.మరి ఈ ఘటనపై నాగసౌర్య స్పందించాల్సి ఉంది.ఇక తాజాగా నాగశౌర్య నటించిన వరుడు కావలెను చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.