ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు కోసం చేసేటువంటి నీచమైన పనులు కారణంగా ఇతరులు చిక్కుల్లో పడుతున్నారు.కాగా తాజాగా నటి కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఓ యువతిని అవకాశం పేరుతో లొంగ దీసుకుని చివరికి ఆమెపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే సోనియా (పేరు మార్చాం) అనే 22 సంవత్సరాలు కలిగినటువంటి యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్ రాష్ట్ర పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే ఇటీవలే సోనియా చదువులు పూర్తి కావడంతో నటనపై ఆసక్తి కలిగింది.
దాంతో తన తల్లిదండ్రులతో చర్చించి ముంబై నగరానికి వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పని చేసింది.
అయితే ఇటీవలే కొందరు వ్యక్తులు సినిమా అవకాశం పేరుతో సోనియాని ఆడిషన్స్ పిలిచారు.
ఈ ఆడిషన్స్ లో భాగంగా సోనియాకి మత్తు మందు ఇచ్చి ఆమె పై అత్యాచారం చేశారు.
అంతేకాకుండా నగ్నంగా వీడియోలు కూడా తీశారు.అంతటితో ఆగకుండా తన అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించ సాగారు.
దీంతో సోనియా తన కుటుంబ సభ్యుల పరువు, ప్రతిష్టలు మరియు తన సినీ కెరీర్ ని భవిష్యత్తులో ఉంచుకుని దాదాపుగా ఐదు లక్షల రూపాయల నిందితులకు ఇచ్చింది.అయినప్పటికీ వారి ధన దాహం తీరకపోవడంతో మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.
దీంతో సోనియా చేసేదేమీ లేక తన కుటుంబ సభ్యులతో సంప్రదించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించింది.దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు సోనియా తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో పొలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు కోసం తాము ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.