ఆస్కార్ అవార్డులు ఇండియన్ సినిమాకు అందని ద్రాక్ష అన్నట్లుగా ఉంది.అవార్డుల సంగతి అలా ఉంచితే కనీసం హిందీ మరియు తమిళం ఇంకా మలయాళం సినిమా లు ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు ఎంపిక అవుతున్నాయి.
నామినేషన్ కు పంపించేందుకు కూడా తెలుగు సినిమా లు ఒక్కటి అంటే ఒక్కటి కూడా అర్హత సాధించడం లేదు.తెలుగు లో వందల కోట్ల సినిమా లు ప్రతి ఏడాది చాలానే వస్తున్నాయి కాని ఏ ఒక్కటి కూడా ఆస్కార్ ముందు వరకు వెళ్లడం లేదు.
తమిళం నుండి ఇప్పటికే మండేలా సినిమా ను ఆస్కార్ నామినేషన్స్ కు పంపించేందుకు సిద్దం అయ్యారు.తాజాగా మరో సినిమా ను కూడా ఆస్కార్ నామినేషన్స్ కు పంపించేందుకు గాను జ్యూరీ మెంబర్స్ ఓకే చెప్పారు.
ఆస్కార్ బరిలో సినిమాలు నిలిచాయి అంటే అదో గొప్ప విజయం అన్నట్లుగానే చెప్పుకుంటూ ఉంటారు.
తాజాగా ఆ అరుదైన గౌరవంను తమిళ సినిమా కూజాంగల్ కూడా దక్కించుకుంది.
విఘ్నేష్ శివన్ మరియు నయనతారలు కలిసి నిర్మించిన ఈ సినిమా కు ఆస్కార్ ఎంట్రీ దక్కడం అదృష్టం అంటూ తమిళ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కమర్షియల్ గా ఆలోచించకుండా ఈ రియల్ జంట ఆస్కార్ రేంజ్ సినిమాను నిర్మించడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ ఆస్కార్ ఎంట్రీలను జ్యూరీ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కు ఆ అవకాశం దక్కింది.విఘ్నేష్ శివన్ చాలా సంతోషంగా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక అయ్యిందని పేర్కొన్నాడు.
ఆ సినిమా ఆస్కార్ ను దక్కించుకోవాలంటే మరో రెండు అడుగులు మాత్రమే ఉంది.ఫైనల్ నామినేషన్ కు సెలక్ట్ అవ్వాలి.
అక్కడ నామినేట్ అయిన సినిమాల్లో ఒక సినిమా గా ఆస్కార్ ను అందుకోవాలి.అక్కడి వరకు ఈ సినిమా వెళ్లినా వెళ్లకున్నా ఇదో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
రెండు తమిళ సినిమాల ఉ ఎంట్రీ దక్కించుకున్నాయి.కాని తెలుగు సినిమాలు మాత్రం కనిపించడం లేదు.
ఇది టాలీవుడ్ కు సిగ్గు చేటు అనడంలో సందేహం లేదు.