1.వైట్ హౌస్ స్టాఫ్ సెక్రెటరీ గా భారతీయ అమెరికన్
భారతీయ అమెరికన్ , పాలసీ నిపుణులు నీరా టాండన్ ( 50) కు అగ్ర రాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది.అధ్యక్షుడు జో బైడన్ ఆమెను శుక్రవారం వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నామినేట్ చేశారు.
2.బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ కు అరుదైన గౌరవం దక్కింది.దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై ఈరోజు రాత్రి 9.40 గంటలకు , 10.40 గంటలకు బూర్జ్ ఖలీఫా పై మూడు నిమిషాల బతుకమ్మ వీడియో ను ప్రదర్శించనున్నారు.
3.గాయకురాలు చిత్ర కు యూఏఈలో అరుదైన గౌరవం
ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర కు యూఏఈ లో అరుదైన గౌరవం దక్కింది.యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఆమెకు మంజూరు చేసింది.
4.కాల్ సెంటర్ స్కామ్ లపై మేల్కొన్న అమెరికా
అమెరికాలో జరుగుతున్న కాల్ సెంటర్ స్కాం లపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, న్యాయశాఖ లు స్పందించాయి.ఈ రెండు విభాగాల అధికారులు భారత్ లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తో ఇటీవల సమావేశం అయ్యారు.
5.వాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్ చేస్తున్న అమెరికా కంపెనీ
అమెరికాలోని ఎడబ్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని, లేకపోతే అన్ పెయిడ్ లీవ్ కింద పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించింది.
6.భారతీయులకు సింగపూర్ శుభవార్త
సింగపూర్ కు అక్టోబర్ 26 నుంచి భారత ప్రయాణికులకు అనుమతిస్తూ ఆదేశం కీలక నిర్ణయం తీసుకుంది.
7.పసిఫిక్ లో తొలిసారి రష్యా, చైనా నేవీ విన్యాసాలు
రష్యా చైనా తొలిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో నేవీ విన్యాసాలు చేపట్టాయి.అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఈ విన్యాసాలు జరిగినట్లు రష్యా రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
8.పోప్ ఫ్రాన్సిస్ తో భారత ప్రధాని భేటీ
క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 29న వాటికన్ లో మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
9.మెక్సికోలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య
మెక్సికోలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంజలి (25) దారుణ హత్యకు గురయ్యారు.
10.ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు హతం
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మతార్ ను అమెరికా బలగాలు అంతమొందించాయి.