స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో రోడ్ యాక్సిడెంట్ లో చికిత్స పొందుతున్న సాయి ధరం తేజ్ ను చూసేందుకు వెళ్లారు.శుక్రవారం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర సాయి ధరం తేజ్ బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఆ ప్రమాదానికి సంబందించిన మొదటి ఫోన్ కాల్ అల్లు అర్జున్ కు వెళ్లినట్టు సమాచారం.ముందు పరిస్థితి సీరియస్ గా అనిపించినా ఫైనల్ గా సాయి ధరం తేజ్ కు ఒక షోల్డర్ సర్జరీ మాత్రమే చేశారు.
మెగా హీరో సాయి ధరం తేజ్ హాస్పిటల్ లో ఉన్న టైం లో మెగా హీరోలతో పాటుగా మిగతా సినీ ప్రముఖులు కూడా అపోలో హాస్పిటల్ లో సాయ్ ధరం తేజ్ ను చూసేందుకు వెళ్లారు.
లేటెస్ట్ గా గురువారం అల్లు అర్జున్ అపోలో హాస్పిటల్ కు వెళ్లి సాయి ధరం తేజ్ ను పలుకరించి వచ్చాడని తెలుస్తుంది.
ప్రస్తుతం సాయి ధరం తేజ్ పరిస్థితి గురించి.మిగతా వీవాలు అడిగి తెలుసుకున్నారు.త్వరలోనే సాయి ధరం తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని చెబుతున్నారు. అపోలో హాస్పిటల్ దగ్గర అల్లు అర్జున్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.