సీటీమార్ 3 రోజుల కలెక్షన్స్.. ఎంతంటే?

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగినా, యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

 Seetimaarr 3 Days Collections, Seetimaarr, Gopichand, Tamannaah, Sampath Nandi,-TeluguStop.com

ఇక గోపీచంద్‌కు చాలా కాలం తరువాత సూపర్ హిట్ పడటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది.

అటు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అదిరగొడుతోంది.ఈ సినిమా తొలి మూడు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.6.50 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

దీంతో ఈ సినిమాకు రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్లు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటించగా, మణిశర్మ సంగీతం అదనపు బలంగా నిలిచింది.

చాలా రోజుల తరువాత పూర్తి యాక్షన్ సినిమాలో గోపీచంద్ నటించిన విధానం బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.అయితే ఈ సినిమాకు అసలు పరీక్ష మాత్రం సోమవారం నుండి ఎదురుకానుంది.

వీకెండ్‌లో అదరగొట్టిన సీటీమార్ చిత్రం వీక్‌డేస్‌లో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

కాగా ఈ సినిమా తొలి మూడు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో రాబట్టిన కలెక్షన్లు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.79 కోట్లు

సీడెడ్ – 1.24 కోట్లు

గుంటూరు – 76 లక్షలు

ఉత్తరాంధ్ర – 73 లక్షలు

ఈస్ట్ – 64 లక్షలు

వెస్ట్ – 36 లక్షలు

కృష్ణా – 37 లక్షలు

నెల్లూరు – 34 లక్షలు

టోటల్ ఏపీ+తెలంగాణ – 6.23 కోట్లు

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 21 లక్షలు

ఓవర్సీస్ – 6 లక్షలు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – రూ.6.50 కోట్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube