అక్కినేని సుశాంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో ఇతను ఒకడు.
అతడు చేసిన కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుని పర్వేలేదు అనిపించినా ఆ తర్వాత వరుస ప్లాప్స్ పలకరించడంతో అక్కినేని హీరో ఢీలా పడ్డాడు.ప్రస్తుతం సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఎస్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అభిప్రాయం తోనే ఉన్నారు.
ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గి థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో చిన్న సినిమాలన్ని విడుదల తేదీని ప్రకటిస్తున్నాయి.ఈ సినిమాను కూడా ఆగస్టు 27 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో సుశాంత్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించింది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా వచ్చాడు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.కరోనా తర్వాత థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు తెలుగు వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చారని.అది సంతోషించదగ్గ విషయం అని ఆయన తెలిపాడు.మంచి సినిమాలు చేసి మరింత ముందుకు వెళ్దాం అని చెప్పారు.
అయితే ఈ సినిమా చేస్తున్న విషయం సుశాంత్ ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న సమయంలోనే చెప్పాడట.
సుశాంత్ చి.ల.సౌ. సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడని.ఆ సినిమా చుసిన తర్వాతే సుశాంత్ ను అల వైకుంఠపురములో సినిమా చేసేందుకు తీసుకున్నానని త్రివిక్రమ్ తెలిపాడు.
ఆ తర్వాత చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలిపాడు.