సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.హైదరాబాద్ వాసుల ట్విట్టర్ విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఆదివారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళించాలని ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.
టూరిస్టు లతోపాటు నగరవాసుల సందర్శనకు అనుగుణంగా ఉండేందుకు ట్రాఫిక్ డ్రైవర్ట్ చేయాలని.హైదరాబాద్ సిపికి సూచించారు.
మంత్రి కేటీఆర్.
ఇప్పటికే సందర్శకులను ఆకర్షించడానికి ట్యాంక్ బండ్ ఫుట్ పాత్ పై చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆకర్షణీయంగా తయారు చేసిన ప్రభుత్వం పక్కన నెక్లెస్ రోడ్డు ఇంకా అదే రీతిలో.హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను సందర్శకులకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగింది.అయితే ట్రాఫిక్ కారణంగా చాలా వరకు సందర్శకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో ప్రతి ఆదివారం ఈ ప్రాంతాలలో ట్రాఫిక్ డ్రైవర్షన్ చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ట్విట్టర్ లో హైదరాబాద్ వాసులు విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.