ఆ సినిమా చూసే త్రివిక్రమ్ 'సుశాంత్' కు ఛాన్స్ ఇచ్చాడట.. !

అక్కినేని సుశాంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో ఇతను ఒకడు.

అతడు చేసిన కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుని పర్వేలేదు అనిపించినా ఆ తర్వాత వరుస ప్లాప్స్ పలకరించడంతో అక్కినేని హీరో ఢీలా పడ్డాడు.

ప్రస్తుతం సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా చేస్తున్నాడు. """/"/ ఈ సినిమా ఎస్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అభిప్రాయం తోనే ఉన్నారు.

ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గి థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో చిన్న సినిమాలన్ని విడుదల తేదీని ప్రకటిస్తున్నాయి.

ఈ సినిమాను కూడా ఆగస్టు 27 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో సుశాంత్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించింది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా వచ్చాడు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.కరోనా తర్వాత థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు తెలుగు వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చారని.

అది సంతోషించదగ్గ విషయం అని ఆయన తెలిపాడు.మంచి సినిమాలు చేసి మరింత ముందుకు వెళ్దాం అని చెప్పారు.

అయితే ఈ సినిమా చేస్తున్న విషయం సుశాంత్ 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్న సమయంలోనే చెప్పాడట.

"""/"/ సుశాంత్ చి.ల.

సౌ.సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడని.

ఆ సినిమా చుసిన తర్వాతే సుశాంత్ ను అల వైకుంఠపురములో సినిమా చేసేందుకు తీసుకున్నానని త్రివిక్రమ్ తెలిపాడు.

ఆ తర్వాత చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలిపాడు.

డబ్బు కావాలా.. ఐతే శవాల మధ్య 10 నిమిషాలు గడపండి.. రూ.25,000 మీవే!