అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఉగ్రరూపం.. పెద్దలతో పాటు పిల్లలకు పొంచి ఉన్న ముప్పు.. రోజుకు 4-5 లక్షల కేసులోచ్చే అవకాశం.. అప్రమత్తంగా ఉండాల్సిందే..

కొద్ది వారాలుగా దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నిలకడగా కొనసాగుతోంది.రోజువారి కేసులు మరణాలు స్వల్ప హెచ్చుతగ్గులతో ఒక స్థాయిలో నమోదవుతున్నాయి.

 Corona Third Wave Hits India In October Children Must Be Taken Care, Corona Thir-TeluguStop.com

అయితే  కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తప్పదని త్వరలోనే అది విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పెద్దలతో పాటు పిల్లల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.

ఈ మేరకు సోమవారం ఒక నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది.మహమ్మారి తదుపరి  దశలో(థర్డ్ వేవ్) 23 శాతం మంది ఆసుపత్రిలో చేరే అవకాశం ఉందని వి.

కే.పాల్ అన్నారు.సెప్టెంబర్ నాటికి రెండు లక్షల ఐసీయూ పడకలు, 12 లక్షల ఐసీయూ వెంటిలేటర్లు, 7 లక్షల ఐసీయూయేతర పడకలు, 5లక్షలు ఆక్సిజన్ పడకలు, 10 లక్షల సాధారణ బెడ్లు సిద్ధం చేయాలని కేంద్రాన్ని కోరారు.ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరి పరిస్థితి తలెత్తితే వైద్య సిబ్బంది వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్య సేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవు.

Telugu Ambulace, Care, Corona Wave, Ventilators, Vk Paul-Telugu Health

చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కోవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలి.ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి.దేశంలో ఇప్పటి వరకు కేవలం 7.6 శాతం (10.4 కోట్ల) మందికి మాత్రమే రెండు డోసుల టీకా ఇచ్చారు.వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి లేదంటే రోజు 3.2 లక్షల కేసులను చూడాల్సి వస్తుంది.అక్టోబర్ లో చేరితే రోజుకు 3 లక్షల కేసులు నమోదు అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube