ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడి పాత్రలలో నటించి అద్భుతమైన అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్.ప్రకాష్ రాజ్ కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ తెలుగులో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుని తెలుగు నటుడిగా స్థిరపడిపోయారు.
విలక్షణ నటుడి పాత్రలో, తండ్రి పాత్రలో, తాతయ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించిన ప్రకాష్ రాజ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.ప్రకాష్ రాజు కింద పడటంతో కాలికి కొద్దిపాటి గాయమైందని అందుకు సర్జరీ చేయించుకోవడం కోసం హైదరాబాద్ వస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
,/br>
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.కింద పడటంతో తన కాలికి గాయం అయిందని కాలికి సర్జరీ చేయించుకోవడం కోసం హైదరాబాద్లో తన స్నేహితుడు అయినటువంటి డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు ప్రకాష్ రాజ్ వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది?అనే విషయాలను మాత్రం ప్రకాష్ వెల్లడించలేదు.ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ట్వీట్ చూసి అభిమానులు కొంతమేర ఆందోళన చెందినప్పటికీ తన ఆరోగ్యం బాగానే ఉంది తనికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రకాష్ రాజ్ తెలపడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
![Telugu Hyderabed, Liger, Prakash Raj, Prakashraj, Tollywood-Movie Telugu Hyderabed, Liger, Prakash Raj, Prakashraj, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/08/hyderabad-for-surgery-Prakash-Raj-prakash-raj-leg-injury-prakash-raj-movies-hyderabed.jpg )
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నారు.అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే షూటింగ్ పనులలో ఉండగా ప్రకాష్ రాజ్ కిందపడ్డారా లేక మరి ఏదైనా ప్రమాదం జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ రెండు సినిమాలలో మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ మా ఎన్నికలలో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.