డ‌బ్బులుంటే చూపించుకోవాలా.. గోల్డెన్ కారుపై ఆనంద్ మ‌హీంద్ర అసంతృప్తి..!

బిజినెస్ టైకూన్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎనీ టైమ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ విదితమే.మన దేశంలోనే కాదు ప్రపంచంలో జరిగే వింత సంఘటనలు, సాధారణంగా చలోక్తులు, ఆసక్తికర విషయాలు, విజ్ఞాన దాయక విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటారు.

 Anand Mahindra Dissatisfied With Golden Car , Golden Car, Anand Mahindra, Saudi-TeluguStop.com

మండే మోటివేషన్ పేరిట ఆయన పోస్ట్ చేసే ఇన్‌స్పిరేషనల్ కంటెంట్ కోసం నెటిజన్లు ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంటారు.అయితే తాజాగా వీటన్నిటికి భిన్నంగా ఇంట్రెస్టింగ్ వీడియో జత చేసి ఆయన ఓ ట్వీట్ చేశాడు.

సదరు వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది.ఇంతకీ ఆ వీడియోలో ఏం విశేషముందంటే.

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్స్‌ను మెచ్చుకునే ఆనంద్ మహీంద్ర గోల్డెన్ ఫెరారీపై మాత్రం డిఫరెంట్ కామెంట్స్ చేశారు.గోల్డెన్ ఫెరారీ హంగూ, ఆర్భాటాలతో కూడినది అన్నట్లు వ్యాఖ్య చేశారు.

కారు ఓనర్ హడావిడి చూస్తుంటే జనాల్లో క్రేజ్ కోసమే అన్నట్లు ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.సంపద ఉంటే ప్రదర్శించాల్సిన అవసరమేంటి? అనే ప్రశ్న తెరమీదకు తెచ్చారు.ఇలాంటి వీడియోలను జనాలు ఎందుకు ఎగబడి చూస్తున్నారో తెలియదు, మనీనీ ఎలా స్పెండ్ చేయొద్దో ఇది చూసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.ఇలాంటి వీడియోలు నెట్టింట ఎందుకు వైరల్‌ ప్లస్ ట్రెండ్ అవుతాయో అర్థం కావడం లేదంటూ ఆనంద్ మహింద్ర విమర్శించారు.

ట్విట్టర్ వేదికగా ఆయన షేర్ చేసిన వీడియో మరింత వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.అయితే, ఈ కారు ఎక్కడిది? దాని రియల్ ఓనర్ ఎవరు? అనే విషయం ఇంకా తెలియదు.కాగా, వీడియో 2017లోనిదని కొందరు పోస్టులు పెడుతున్నారు.సౌదీ నెంబర్ ప్లేటుతో ఉన్న ఈ వీడియో పాతదేనని మరికొందరు అంటున్నారు.ఇటలీ దేశానికి చెందిన ఫెరారి కంపెనీ అత్యంత విలువైన కార్లను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నది.ఇంటర్నేషనల్ ప్లస్ ఇండియన్ మార్కెట్‌లో ఫెరారీ కార్లకు మంచి డిమాండే ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube