రంజాన్ తర్వాత ముస్లిం ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే పండుగ బక్రీద్.ఈ నేపథ్యంలో రేపు బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ముస్లిం ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ త్యాగానికి అదే రీతిలో దేవుడిపట్ల సంపూర్ణం భక్తి మరియు విశ్వాసం పేదల పట్ల దయ అదేవిధంగా దాతృత్వానికి ప్రతీక గా పండుగ జరుపుకుంటారని గవర్నర్ అభివర్ణించారు.
అదే రీతిలో పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోన నిబంధనలు పాటించాలని నిర్లక్ష్యం వహించ కూడదు అని స్పష్టం చేశారు.
మాస్కు ధరించటం అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించటం వల్ల కరోనా విస్తరించకుండా ఉంటుందని ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ రేపు బక్రీద్ పండుగ పురస్కరించుకుని.
ముస్లిం సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.త్యాగం సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు అన్ని.
అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలి అని జగన్ కోరుకున్నారు.