ఆటో అనగానే సాధారణంగా వెనుక భాగంలో ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా సీట్లు ఉంటాయి.మహా అయితే ప్రయాణ సమయంలో బోరు కొట్టకుండా ఉండేందుకు డెక్కు పెడ్తుంటారు.
కొంచెం అందంగా డెకరేట్ చేస్తుంటారు.ముందర భాగంలో డ్రైవర్ కోసం సెపరేట్ సీటు, పక్కనే అద్దాలు ఉంటాయి.
ఇది నార్మల్ ఆటో అయితే ఉండే ఆంబియెన్స్, ఫెసిలిటీస్.కానీ, ఆటో ఒకవేళ స్పెషల్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.అదెంటీ? ఆటోలో స్పెషల్ ఏంటి? అనుకుంటున్నారా? అవునండీ.ఆటో ఎక్కితే స్టార్ హోటల్‌కు వెళ్లినట్లి ఫీల్ వస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదండి.ఆ ఆటో లగ్జరీ హోటల్‌లా ఉంటుందండోయ్.అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని కంప్లీట్‌గా మీరు చదవాల్సిందే.
తమిళనాడులోని చెన్నైకి చెందిన అన్నాదురై ఈ స్పెషల్ ఆటో తయారు చేశాడు.చైల్డ్‌హుడ్ నుంచి బిజినెస్ మ్యాన్ కావాలనుకున్న అన్నాదురై తన ఆటోనే బిజినెస్ ఐడియాగా మలుచుకున్నాడు.
ఈ క్రమంలో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటూ అందులో డిఫరెంట్ ఫెసిలిటీస్ కల్పించే టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అయ్యాడు.తన స్టోరీని పలు సంస్థలు ప్రచురితం చేయగా, ఆయన తయారుచేసిన ఆటో నెట్టింట వైరలవుతోంది.ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం జనాలకు సేఫ్టీ ముఖ్యం.ఈ నేపథ్యంలో కరోనా పాండమిక్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నాదురై ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు.దానికి తోడు ప్రయాణికులను తమ డెస్టినేషన్‌కు వెళ్లేంత వరకు హెల్దీ అట్మాస్పియర్ కల్పించాలనుకున్నాడు.అందులో భాగంగా ఆటోలో ఐపాడ్, చిన్న ఫ్రిజ్, టెలివిజన్ ఏర్పాటు చేశాడు.
ఇక ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు.తాము ఎక్కింది ఆటోనేనా? అని తమను తాము ఒకసారి ప్రశ్నించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.స్టార్ హోటల్ ఆంబియెన్స్‌ను ఆటోలో కల్పించాడు ఆటో డ్రైవర్ అన్నాదురై.కాగా, ఈ డిఫరెంట్ ఐడియాతో అన్నాదురై లైఫే మారిపోయింది.కస్టమర్లే దేవుళ్లని భావించే అన్నాదురై తొమ్మిది భాషల్లో మాట్లాడగలడు.హైటెక్ ఆటోలో కస్టమర్లకు మర్యాద లోటు ఏముండదని అన్నాదురై చెప్తున్నాడు.
హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే సంస్థ వారు ఇన్‌స్పైరింగ్ పర్సన్ అన్నాదురై స్టోరీని ఇన్ స్టా వేదికగా వీడియో రూపంలో షేర్ చేశారు.దానిని ఇప్పటికే 1.3 మిలియన్ల కన్న ఎక్కువ మంది చూడగా, ఇంకా చాలా మంది చూస్తున్నారు.వీడియో చూసిన చాలా మంది భావిభారిత ఎంట్రప్రెన్యూర్స్ ఇలాంటి వారే అని మెచ్చుకుంటున్నారు.
ఆటోడ్రైవర్ అన్నాదురైపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.