ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు, సింహం, చిరుత, పులి లాంటి పెద్ద జంతువులు వేటాడే వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం.
సాధారణంగా వేటాడే జంతువులు ఎప్పుడూ కూడా తమ ఏరను వెతుకుతూనే ఉంటాయి.అంతే కాకుండా జంతువులను పట్టుకోవడానికి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పాటు ఎవరికీ ఊహించని విధంగా వాటి పై దాడి పాల్పడుతూ ఉంటాయి.
కేవలం జంతువులు మాత్రమే కాకుండా ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా అలానే వ్యవహరించడం మనం చూస్తూనే ఉంటాం. గుడ్లగూబ లాంటివి వేటాడే పక్షులు అయితే ఆకాశం నుంచి భూమిపై తిరిగే తమ ఎరను గుర్తించడంతో పాటు దానినే ఆసరాగా చేసుకుని ఒక్కసారిగా దాడి చేసి గాల్లోకి పక్షులను తీసుకెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం.
అలంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉండడం లాంటివి సహజం.అయితే తాజాగా ఒక గద్దపై గుడ్లగూబ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా గుడ్లగూబ చీకటిని సద్వినియోగం చేసుకొని నిద్రపోతున్న
గద్దపై
ఒక్కసారిగా దాడికి పాల్పడింది.అలాగే గుడ్లగూబ తన కంటే పెద్దదిగా ఉన్న డేగ పై ఒక్కసారిగా దాడి చేసిన అనంతరం ఎలా గాల్లోకి ఎగిరి తీసుకోనిపోతుంది మనం చూడవచ్చు.
ఇక చీకటిలో గుడ్లగూబ ఎక్కడికి తీసుకొని వెళ్తుందో నిద్రపోతున్న ఈగల్ కు అర్థం కాదు కనుక, ఆ సమయంలో దాడి చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఫలితం ఉండదు.ఇక గుడ్లగూబ రాత్రిపూట తిరిగే పక్షి కనుక దానికి అంత ఇట్లే తెలిసిపోతుంది.గద్దపై గుడ్లగూబ దాడికి సంబంధించిన వీడియోను లైవ్ నేచర్ అనే వారు సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయగా అది కాస్తా నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.