టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటికప్పుడు తన దైన రీతిలో మైదానంలో తన టాలెంట్ నిరూపించుకున్న ధోని అంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం.
తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఓ సిక్సర్ ను గూగుల్ గుర్తించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.ఈ సందర్భంగా గూగుల్ గుర్తించిన ప్రదేశాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఐపీఎల్ 2020 మ్యాచ్ లో భాగంగా షార్జా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మహేంద్ర సింగ్ వరుసగా తనదైన శైలిలో సిక్సర్లతో రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో ఒక సిక్స్ స్టేడియం బయట పడటంతో స్టేడియం బయట ఉన్న ఓ అభిమాని ఆ బంతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఇక ఆ ప్లేస్ ను ధోనీ ఫ్యాన్స్ అందరూ ధోని సిక్స్ గా పేరు పెట్టి గూగుల్ అభ్యర్థించారు.
తాజాగా గూగుల్ నుంచి కన్ఫర్మేషన్ రావడంతో ధోని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.
ఇక గత సంవత్సరం ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ఆడుతున్నట్లు ప్రకటించాడు.కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన సంగతి అందరికీ విధితమే.
దీంతో ఇంటికే పరిమితమై తన సమయాన్ని మొత్తం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేస్తుంటారు.ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్ లన్నీ సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం అవ్వబోతున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పటి వరకు ధోనీ ఐపీఎల్ సీజన్స్ లో 211 మ్యాచులు అడగ్గా 4669 పరుగుల ను సొంతం చేసుకున్నాడు.