టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీను వైట్ల కొంతకాలం పాటు స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగారు.ఎంత వేగంగా స్టార్ డైరెక్టర్ అయ్యారో అంతే వేగంగా తన కెరీర్ కిందకు పడిపోయింది.
ఈయన సినిమాలంటే అప్పట్లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు.కమర్షియల్ సినిమాలకు కామెడీ జోడించి పండించే సినిమాలకు ప్రేక్షకులు కొంతకాలం బ్రహ్మరధం పట్టారు.
కానీ ముందుగా ఎంత ఎంజాయ్ చేసారో తర్వాత అదే సినిమాలు అటు తిప్పి ఇటు తిప్పి తీయడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి.దీంతో వరుస డిజాస్టర్స్ ఎదురయ్యాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమాతో శ్రీను వైట్ల కెరీర్ ఒక్కసారిగా గాడి తప్పిపోయింది.ఈ సినిమా మరీ రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు డిజాస్టర్ చేసారు.
ఒకప్పుడు స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన శ్రీను వైట్ల వరుస ప్లాప్స్ రావడం తో స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.ఈ నేపథ్యంలో మళ్లీ ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో మంచు విష్ణు తో డి అండ్ డి సినిమాను త్తెరకేక్కిస్తున్నాడు.
అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో శ్రీను వైట్ల మీద వస్తున్నా రూమర్స్ పై ఆయన స్పందించారు.ఒక ఇంటర్వ్యూ లో ఆయనపై వస్తున్న రూమర్స్ పై ఒక క్లారిటీ ఇచ్చారు.
శ్రీను వైట్ల దూకుడు 2 సినిమాతో పాటు చిరంజీవి మహేష్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై శ్రీను వైట్ల ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు.దూకుడు 2 సినిమా చేయాలనీ లేదని కొన్ని సినిమాలను అలానే వదిలేస్తేనే మంచిదని అంతేకాదు చిరంజీవి మహేష్ తో కూడా ఎలాంటి సినిమా చేయడం లేదని ఆయన ఈ వార్తలను ఖండించాడు.
అయితే డబుల్స్ అనే ఒక మల్టీ స్టారర్ కథను రాసుకున్నాడట శ్రీను వైట్ల.కానీ ఇందులో మహేష్, చిరంజీవి హీరోలు కాదని డి అండ్ డి సినిమాకు కంటిన్యూ గా ఉంటుందని ఆయన తెలిపాడు.త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలతో రాబోతున్నానని తెలిపారు.