ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి ఇప్పటికి ఎంతో మంది హీరోలు పరిచయమయ్యారు.ఎంట్రీ తోనే మంచి గుర్తింపు అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు.
ఇక తాజాగా మరో హీరో సోదరుడు గణేష్బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.అది కూడా రీమేక్ సినిమాతో అని తెలుస్తుంది.
ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని బాలీవుడ్ లో కూడా రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.2014లో వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమా తో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత వరుస సినిమాలలో నటించాడు.ఈ ఏడాది అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇప్పటికే చత్రపతి రీమేక్ సినిమా తో బాలీవుడ్ లో నటిస్తున్నాడు.,/br>
అంతే కాకుండా ఈ సినిమా తర్వాత తమిళంలో సూపర్ హిట్ గా సక్సెస్ అందుకున్న కర్ణన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే శ్రీనివాస్ సోదరుడు గణేష్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని గతంలో వార్తలు వినిపించాయి.
ఇక అప్పటినుండి తనకు తగిన కథ దొరకకపోవడంతో అప్పటినుండి తన ఎంట్రీ కి వాయిదాలు ఎదురవుతున్నాయి.
ఇక దీంతో ఆయన ఎంట్రీ గురించి పలు చర్చలు జరుగుతున్నాయి.బెల్లంకొండ శ్రీనివాస్ తమిళం మూవీ కర్ణన్ రీమేక్ లో నటించడానికి అవకాశం లేకపోతే.ఆ సినిమాను గణేష్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి టాలీవుడ్ కు రీమేక్ సినిమాతో గణేష్ ఎంట్రీ ఇవ్వడానకి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.అంతే కాకుండా మరో రీమేక్ సినిమా చేసేందుకు కూడా గణేష్ సిద్ధంగా ఉన్నాడట.2006లో మంచి సక్సెస్ అందుకున్న వివాహ్‘ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా చేయనున్నట్లు తెలుస్తోంది.