కరోనా సమయంలో వచ్చిన మూడు నాలుగు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ ఏడాది సూపర్ హిట్ జాబితాలో నిలిచే జాతిరత్నాలు చిత్రంకు సీక్వెల్ అంటూ ఇటీవలే దర్శకుడు అనుదీప్ ప్రకటించిన విషయం తెల్సిందే.
కథను తయారు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు.ఈసారి జాతి రత్నాలు అమెరికా లేదా మరో దేశంలో తమ సందడి కొనసాగిస్తారంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సహజంగానే సీక్వెల్ పై జనాల్లో ఆసక్తి ఉంది.ఆసక్తికి తగ్గట్లుగా సినిమా ను దర్శకుడు అనుదీప్ తనదైన శైలిలో విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ సీక్వెల్ లో కూడా నవీన్ పొలిశెట్టితో పాటు కమెడియన్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.ఈ సమయంలో రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాహుల్ రామకృష్ణ తాజాగా ఒక సందర్బంగా మాట్లాడుతూ జాతిరత్నలు సినిమా తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు.అదే సమయంలో సీక్వెల్ గురించి స్పందించాల్సిందిగా కోరగా తనకు తెలియదు అంటూ తేల్చి చెప్పాడు.
అదేంటి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాహుల్ రామకృష్నకు ఎందుకు తెలియదు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.రాహుల్ రామకృష్ణ కు సీక్వెల్ లో ఛాన్స్ ఇవ్వడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జాతిరత్నాలు సీక్వెల్ విషయాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశ్యంతో రాహుల్ రామ కృష్ణ విషయాన్ని తనకు తెలియదు అంటూ దాటవేశాడేమో అంటూ కొందరు భావిస్తున్నారు.
మొత్తానికి సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న వారికి రాహుల్ రామ కృష్ణ మాటలు మింగుడు పడటం లేదు.