తమిళంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సూర్య ఒకరు.ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
ఈయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి వసూళ్లు చేస్తాయి.గజినీ సినిమాతో పాపులర్ అయినా సూర్య తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
ఈయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉంటారు.ఎప్పుడూ విభిన్నమైన కథలతో ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తాడు సూర్య.
ఈ మధ్యే విడుదల అయినా ‘ఆకాశం నీ హద్దురా‘ సినిమా ద్వారా మంచి హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు సూర్య.ఈ సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం ఈయన చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయని సమాచారం.ప్రస్తుతం ఈయన పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇది ఈయన కెరీర్ లో 40 వ సినిమాగా తెరకెక్కుతుంది.
అయితే ఈయన ఈ సినిమా పూర్తి కాకుండానే 41 వ సినిమా చేయబోతున్నాడు.ఇప్పుడు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఈ సినిమాను టి జె జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు.ఐపాతికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.
అయితే ఈ సినిమాలో సూర్య మొదటిసారి లాయర్ పాత్రలో కనిపించే బోతున్నాడని సమాచారం.
ఈ విషయం గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించు కుంటున్నారు.సూర్య మొదటిసారి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో సూర్య సరసన కర్ణన్ ఫేమ్ రజిషా విజయన్ నటించబోతుంది.