టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరును సంపాదించుకున్న శ్రీదేవి కొన్నేళ్ల క్రితం ఊహించని విధంగా చనిపోయిన సంగతి తెలిసిందే.తెలుగులో శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లయ్యాయి.
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి అప్పటి సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా నటించారు.ఈ భాష, ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో ఆమె నటిగా రాణించారు.
సాధారణంగా సినిమా రంగంలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లను తమ కొడుకులు, కూతుళ్లను కూడా సినిమాల్లో నటింపజేయాలని అనుకుంటారు.అయితే శ్రీదేవి మాత్రం తన కూతురు జాన్వీ కపూర్ ను యాక్టర్ చేయాలని అస్సలు అనుకోలేదు.
తన కూతురును డాక్టర్ ను చేయాలని శ్రీదేవి అనుకున్నారట.ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
అమ్మ నటిగా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నా తనను మాత్రం నటిని చేయలని అనుకోలేదని జాన్వీ అన్నారు.
మమ్మీ డాక్టర్ చేయాలని భావించినా డాక్టర్ చదివేంత తెలివితేటలు తనకు లేవని జాన్వీ చెప్పుకొచ్చారు.చదువు తనకు బాగా రాకపోవడం వల్లే నటిగా తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు విషయాన్ని జాన్వీ కపూర్ వెల్లడించారు.
జాన్వీ కపూర్ నటించిన రూహి2 సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈమె గుడ్ లక్ జెర్రీ, దోస్తానా2 సినిమాలలో నటిస్తున్నారు.జాన్వీ నటిస్తున్న మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.స్టార్ డైరెక్టర్ల సినిమాల్లోనే జాన్వీ కపూర్ ఎక్కువగా నటిస్తూ ఉండటం గమనార్హం.ఒకవేళ జాన్వీ కపూర్ డాక్టర్ అయ్యి ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక మంచి నటిని మిస్ అయ్యి ఉండేది.