బుల్లితెర యాంకర్ సుమ కనకాల అంటే చాలు ప్రతి ఒక్కరూ ఇట్టాగే గుర్తు పట్టేస్తుంటారు.ఇక ఈమె యాంకరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన యాంకరింగ్ తో అందరిని ఇట్టాగే మాయలో పడేస్తుంది.అందరినీ తెగ నవ్విస్తుంది.
నటిగా పరిచయమైన సుమ యాంకర్ గా మాత్రం ఒక రేంజ్ లో పేరు సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా సుమ బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఈటీవీ , స్టార్ మా, జీ తెలుగు వంటి పలు చానల్లో సుమ ఎన్నో కామెడీ షో లకు, ఎంటర్టైన్మెంట్ షోలకు యాంకర్ గా చేసింది.చేస్తుంది కూడా.
ఇక ప్రతి ఒక్క సినిమా ఈవెంట్ ఫంక్షన్లలో కూడా సుమనే యాంకరింగ్ చేస్తుంది.ప్రతి ఒక్కరిని తన మాటలతో చమత్కారిస్తుంది.
తెగ సెటైర్లు కూడా వేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి ను అందరి ముందే గాలి తీసింది.
జీ తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోలో యాంకర్ రవి తో పాటు సుమ కూడా యాంకరింగ్ చేస్తోంది.ఇక ఇందులో సెలబ్రెటీలు పాల్గొని తెగ సందడి చేస్తుంటారు.ఇక తాజాగా ఓ మూవీ సెలబ్రెటీలు పాల్గొనగా వారి సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో సుమ రవి పరువు తీసింది.
ఇక హీరోను మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా ఉందా అని రవి అడగగా.
రొమాంటిక్ సీన్స్ చేయడం కాస్త చాలెంజ్ గా అనిపించిందని అన్నాడు.వెంటనే మేఘన తో చేయడమా అని రవి కౌంటర్ వేయగా వెంటనే ఆమె కాస్త కోపంగా చూసింది.
ఇక వెంటనే సుమ రవిని.హీరోని ఉద్దేశించి అరే.అలాంటివి చేసే ముందు అని కౌంటర్ వేసింది.ఇక అక్కడున్న వాళ్ళంతా నవ్వగా వెంటనే రవి కవర్ చేసుకునేందుకు తంటాలు పడ్డాడు.
అలా చెబితే వీడు వేరే రకం సినిమాలు చేస్తున్నాడని అనుకుంటారంటూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు రవి.ఇక కర్చీఫ్ ఉందా అంటూ మ్యాజిక్ చేసే వ్యక్తి రవి ని అడగగా.హా ఉంది ఎప్పుడు పెట్టుకొని ఉంటాను అని అన్నాడు.దీంతో సుమ మళ్లీ కౌంటర్ వేసి పరువు తీసేసింది.