తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుండి వాతావరణం లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనిస్తూనే ఉంటారనుకుంటున్నా.గత నెల, రెండు నెలల క్రితం విపరీతమైన వేడితో ఎండలు దంచికొట్టాయి.
కానీ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షాలు మొదలైయ్యాయి.,/br>
ఈ సందర్భంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చిన్న హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మొదలగు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తుంది.
ఇదిలా ఉండగా రాగల 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రంలో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు ఒకటి, రెండు చోట్ల వడగండ్ల వర్షం పడే అవకాశం కూడా ఉందని, మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు.