యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫిక్షన్ కథాంశంతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో దీపికా పదుకునే ప్రభాస్ కి జోడీగా నటిస్తూ ఉండగా అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.ఫ్యూచర్ ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ కీలక అప్డేట్ వినిపిస్తుంది.
సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్స్ ని నాగ్ అశ్విన్ దగ్గరుండీ మరీ వేయిస్తున్నారు.ఈ సెట్స్ నిర్మాణం తుదిదశకి చేరుకున్నట్లు సమాచారం.
మరో వైపు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తుంది.సింగీతం శ్రీనివాసరావుతో మరికొంత మంది రచయితలతో నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీరాముడుగా ప్రభాస్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
ఇక శ్రీరామనవమి సందర్భంగా ఆది పురుష్ సినిమా నుంచి శ్రీరామ పట్టాభిషేకం విజువల్ ని ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.మరో వైపు సలార్ షూటింగ్ కోసం కూడా ప్రశాంత్ నీల్ హైదరాబాద్ సమీపంలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేయించినట్లు తెలుస్తుంది.