గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న చిన్నారి బాలుడు.. ఎందుకోసం అంటే.. ?

లోకంలో మనిషికి తెలియకుండా సంభవించే మరణం కలిగించే బాధ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.కానీ మరణించడం ఖాయం అని తెలిసి ఆ మరణం కోసం ఎదురుచూస్తూ బ్రతకడం మాత్రం నరకమే అవుతుంది.

 The Little Boy Who Took Charge As The Guntur District Sp, Guntur District, Sp Am-TeluguStop.com

అందులో నయం కానీ జబ్బులతో పడే వేదన మరి చిన్న పిల్లలకు కలిగితే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం బ్రహ్మతరం కూడా కాదు.

ఇకపోతే ఇలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ముఖంలో సంతోషం నింపడం కోసం గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కొంత సేపటి వరకు తన పోస్టును ఆ చిన్నారికి అప్పచెప్పాడు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే.గుంటూరుకు చెందిన నోయల్ చాంద్, బీబీ నూర్జహాన్ దంపతుల కుమారుడు రిహాన్ క్యాన్సర్ బారినపడడంతో ఎలాగోలా అతడికి చికిత్స చేయిస్తున్నారు.ఈ క్రమంలో అతనికి పోలీసు అవ్వాలన్న కోరిక బలంగా ఉందన్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ గుంటూరు జిల్లా పోలీసులకు తెలిపిందట.

దాంతో క్యాన్సర్ బాధిత చిన్నారి రిహాన్ ను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఎస్పీ ఆ బాలుడిని తన కుర్చీలో కూర్చోబెట్టడమే కాకుండా, ఎస్పీగా బాధ్యతలు కూడా అప్పగించారట.

ఈమేరకు ఎస్పీ చాంబర్ లో కూర్చుని, ఆదేశాలు ఇస్తున్న ఈ చిన్నారి ముఖంలో ఆనందం నిజంగా వెలకట్టలేనిదని వారు పేర్కొంటున్నారు.కాగా బ్రతుకుతాడో లేదో తెలియని చిన్నారి కోరిక పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ అమ్మిరెడ్డిది నిజమైన మానవత్వం అంటూ అందరూ అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube