సమాజంలో కొందరు తప్పు చేస్తే సహించని వ్యక్తులు ఉంటారు.వారి కళ్లముందు ఏదైన పొరపాటు జరిగితే ఏం చేయలేకపోతున్నాం అనే బాధ సృష్టంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా సరైన మార్గంలో బండి నడుపుతున్న వారికి కొందరు ఆకతాయిల దుశ్చర్యవల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఇలా తప్పుచేయకున్నా ఎదుటి వారు చేసిన తప్పువల్ల, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రాణాలు కూడా పోయిన సందర్భాలున్నాయి.
అలాంటి వారిని రెడ్ హ్యాండ్‌గా పోలీసులు పట్టుకుని శిక్షిస్తే బాగుండు అని అనిపిస్తుంది.కానీ ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉండరు.అందుకే మీరే పోలీసు అవతారం ఎత్తి వారి భరతం పట్టమని చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఇలా వినూత్నంగా ముందుకెళ్తున్నారు.
ఈ క్రమంలో ప్రజలే పోలీసులుగా మారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి భరతం పట్టే ఛాన్స్ ఇస్తున్నారు.
కాగా సైబరాబాద్ పరిధిలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వెంటనే వారి ఫోటో లేదా వీడియో తీసి, తేదీ టైం, ప్రదేశం జతచేసి 9490617346 నెంబర్ కు వాట్సాప్ చేస్తే చాలు మిగతాది పోలీసులు చూసుకుంటారని చెబుతున్నారు.
అయితే ఈ సమాచారం ఇచ్చిన వారి వివరాలు మాత్రం ఎవరికీ చెప్పరట.ఇక భయమెందుకు ప్రమాద రహిత ప్రణాళికలో మీరు భాగస్వాములు అవ్వండి.
యూనిఫాం లేని పోలీసుగా మారండి.