అధిక బ‌రువుతో భాద ప‌డుతున్నారా.. అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని మిలియ‌న్ల మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.అధిక బ‌రువు ప్ర‌స్తుత కాలంలో అతి పెద్ద భార‌మైన మ‌రియు బ‌రువైన‌ స‌మ‌స్య‌గా మారింది.

 Benefits Of Lemon And Turmeric Powder Drink! Lemon And Turmeric Powder Drink, Le-TeluguStop.com

అతిగా తిన‌డం, శ‌రీర శ్ర‌మ లేక‌పోవ‌డం, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, మారిన జీవ‌న శైలి, హార్మోన్ల మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇక ఈ అధిక బ‌రువు ఊర‌క‌నే ఊరుకుంటుందా.

అనేక జ‌బ్బుల‌ను వెంట తీసుకొస్తుంటుంది.

ఆ భ‌యంతోనే ఎలాగైనా బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే బ‌రువును త‌గ్గించ‌డంలో పసుపు నిమ్మరసం కలిపిన పానీయం అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం, ప‌సుపు రెండిటిని బాగా క‌లిపి సేవించాలి.

ఈ డ్రింక్ ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.

అలాగే నిమ్మ ర‌సంలో ఉండే విటమిన్ సి, ఫైబర్ మ‌రియు పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో జీవక్రియను మెరుగుపరచ‌డంతో పాటుగా ఆకలిని నియంత్రిస్తుంది.

దాంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే నిమ్మ‌రసం, ప‌సుపు క‌లిపిన డ్రింక్ తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డ‌టానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

దాంతో అనేక వైర‌స్‌లు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.

అంతేకాదు, పసుపు మ‌రియు నిమ్మరసం కలిపిన డ్రింక్‌ను ప్ర‌తి రోజు సేవించ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ప్రాణాంత‌కమైన క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గ‌డం, ఆందోళన, అలసట‌, డిప్రెషన్ వంటి స‌మ‌స్య‌లు దూరం కావ‌డం, లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డ‌టం, మ‌ధుమేహం వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గ‌డం ఇలా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ‌చు.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారే కాదు.అంద‌రూ ఈ సూప‌ర్ అండ్ ఎఫెక్టివ్ డ్రింక్‌ను తీసుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube