మరోసారి హీరోగా లక్ టెస్ట్ చేసుకుంటున్న బ్రహ్మాజీ

నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి బ్రహ్మాజీ.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, కమెడియన్ గా బ్రహ్మాజీ మల్టీ షేడ్స్ పాత్రలలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

 Brahmaji Lead Role In Hangmen Movie,tollywood, Telugu Cinema, South Cinema, Dire-TeluguStop.com

అతని కెరియర్ లో కృష్ణ వంశీ దర్శకత్వంలో సిందూరం అనే సినిమాలో మొదటిగా హీరోగా నటించి మెప్పించాడు.తరువాత కొన్ని సినిమాలు చేసినా అవేవి వర్క్ అవుట్ కాలేదు.

దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ మారి బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.తరువాత గుణ అనే సినిమాలో మరోసారి హీరోగా నటించి మెప్పించాడు.

ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.దీంతో హీరోగా తన ప్రయత్నాలు పక్కన పెట్టేశాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కమెడియన్ గా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.అయితే చాలా గ్యాప్ తర్వాత మరో సారి హీరోగా నటించేందుకు రెడీ అయ్యాడు.

బ్రహ్మాజీ హీరోగా కనిపించబోతున్నాడు.అలాగని ఇది రెగ్యులర్ హీరోయిజం సినిమా కాదు.కంటెంట్ బేస్ స్టోరీ.హ్యాంగ్ మెన్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

విహన్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ తలారి పాత్రలో కనిపించబోతున్నాడు.

కన్నడంలో గతంలో ఇలాంటి జోనర్ లోనే సినిమా వచ్చింది.దానిని తెలుగులో ఆటగదరా శివ టైటిల్ తో రీమేక్ చేశారు.

మరి ఈ హ్యాంగ్ మెన్ సినిమాలో ఎలాంటి కోణాన్ని దర్శకుడు చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube