అవును.ఫోటో చూశారా ? గుర్తొచ్చాడా? హా అతనే.”స్రవంతి” సీరియల్ లో భర్త పాత్రలో నటించిన విలన్.శాడిస్ట్ భర్త.
స్రవంతి సీరియల్ లో స్రవంతికి భర్తగా నటించిన భరణి అప్పట్లో అందరితో తిట్టించుకునే వాడు.స్రవంతి సీరియల్ లో మోస్ట్ శాడిస్ట్ భర్తగా పేరు పొందిన విలన్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
ఆ సినిమాల్లోను విలన్ తో పాటు కమెడియన్ గా కూడా నటించి మంచి మార్కులు కొట్టేశాడు ఈ నటుడు.
అలాంటి ఈ నటుడు ఇప్పుడు బ్రేక్ లేకుండా కంటిన్యూగా సీరియల్స్ లో నటిస్తున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు జెమినిలో వస్తున్న సీరియల్స్ లో కంటిన్యూగా నటిస్తున్న.అమ్మ కోసం అనే సీరియల్ లోను, భాగ్యరేఖ సీరియల్ లో నటిస్తున్నాడు.
స్రవంతి సీరియల్ లో భార్యను టార్చర్ చేసినట్టు భాగ్యరేఖ సీరియల్ లో కోడలిని చంపాలని చూస్తున్నాడు.ఇక మరోవైపు అమ్మ కోసం అనే సీరియల్ లోను అతను తన మొదటి భార్యను వదిలేసి రెండో భార్యతో ఉంటున్నాడు.
ఇలా ఈ సీరియల్స్ లోనే కాకుండా గతంలోనూ నాగబాబుతో కలిసి ఓ సీరియల్ లో నటించాడు.ఆ సీరియల్ లో మొదట హీరోగా నటించిన భరణి ఆతర్వాత నెమ్మదిగా విలన్ లా మారిపోతాడు.
ఇలా అప్పట్లో సీతామహాలక్ష్మి అనే సీరియల్ ని కూడా తన విలనిజంతో శాడిజాన్ని చూపించి నటుడు భరణి హిట్ కొట్టాడు.అలా భరణి సీరియల్స్ టాప్ విలన్ గా నిలిచిపోయాడు.
ఏది ఏమైనా శాడిస్ట్ భర్త ఎవరు అని అంటే చాలు భరణినే గుర్తొస్తాడు.మరి మీరు ఏం అంటారు?
.