తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి 2 సినిమా వరకు అపజయం ఎరుగని దర్శకునిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు.సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకోవడంతో పాటు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతి కూడా పెరిగేందుకు కృషి చేస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం, ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో ఇతర ఇండస్ట్రీల అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.
నిన్న ఈ సినిమా నుంచి రామరాజు ఫర్ భీమ్ పేరుతో ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది.
నిన్న ఉదయం విడుదలైన ఈ టీజర్ కు 13 మిలియన్ల వ్యూస్, 9 లక్షల లైక్స్ వచ్చాయి.అయితే రాజమౌళి గత సినిమాలలోని కొన్ని సీన్ల విషయంలో కాపీ ఆరోపణలు వినిపించినట్టుగానే ఈ సినిమా విషయంలో కూడా కాపీ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.టీజర్ లో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా చూపించే సీన్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లోనిది అని.9 నెలల క్రితమే ఆ ఛానల్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేసిందని తేలింది.
సినిమాలోని మరికొన్ని షాట్లు కూడా వేర్వేరు వీడియోల నుంచి సేకరించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ, మర్యాద రామన్న సినిమాల విషయంలో కూడా కాపీ ఆరోపణలు వినిపించాయి.మరి రామరాజు ఫర్ భీమ్ టీజర్ కాపీ ఆరోపణల విషయంలో జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.
అయితే రాజమౌళి అభిమానులు మాత్రం అగ్ని పర్వతాలకు కొత్తగా ఎవరూ సృష్టించలేరు కదా.? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.