చావు కబురే తీపి కబురు తేవాలట!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలోనే కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

 Karthikeya Confident On Chavu Kaburu Mellaga, Karthikeya, Chavu Kaburu Mellaga,-TeluguStop.com

ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.
కౌశిక్ పెగళ్ళపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ ఫుల్టూ ఎంటర్‌టైనర్ మూవీలో బస్తీ బాలరాజు అనే మాస్ పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.అయితే గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కార్తికేయ, ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు.ఇక విభిన్నమైన టైటిల్‌తో వస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంపై చిత్ర యూనిట్ ధీమాగా ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని హీరో భావిస్తున్నాడు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు జేక్స్ బినోయ్ సంగీతం అందిస్తు్న్నాడు.శవాల వ్యాన్ నడిపే బస్తీ బాలరాజు ప్రేమ కోసం ఎలాంటి తిప్పలు పడ్డాడు అనేది సినిమా కథ అని చిత్ర టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాతో హిట్ కొట్టి తన నెక్ట్స్ ప్రాజెక్టులకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాలనే ఈ హీరో ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube