చావు కబురే తీపి కబురు తేవాలట!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.

కౌశిక్ పెగళ్ళపాటి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ ఫుల్టూ ఎంటర్‌టైనర్ మూవీలో బస్తీ బాలరాజు అనే మాస్ పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

అయితే గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కార్తికేయ, ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు.

ఇక విభిన్నమైన టైటిల్‌తో వస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంపై చిత్ర యూనిట్ ధీమాగా ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని హీరో భావిస్తున్నాడు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు జేక్స్ బినోయ్ సంగీతం అందిస్తు్న్నాడు.

శవాల వ్యాన్ నడిపే బస్తీ బాలరాజు ప్రేమ కోసం ఎలాంటి తిప్పలు పడ్డాడు అనేది సినిమా కథ అని చిత్ర టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఈ సినిమాతో హిట్ కొట్టి తన నెక్ట్స్ ప్రాజెక్టులకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాలనే ఈ హీరో ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ఒహియో సెనేట్ సీటుపై వివేక్ రామస్వామి కన్ను? .. ట్రంప్‌తో మంతనాలు అందుకేనా?