అక్కినేని నాగ చైతన్య… అక్కినేని ఫ్యామిలీ లో మూడో తరం నుండి వచ్చిన హీరో ఈయన.తను సిని ప్రపంచంలోకి వచ్చినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది పడిన తర్వాత మంచి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఒక వైపు సమంత తో వివాహం చేసుకొని స్థిరపడిన నాగచైతన్య, ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.నాగచైతన్య ఎప్పుడు మూడు కంటే ఎక్కువ సినిమాలను చేతిలో పెట్టుకొని ఫుల్ బిజీగా ఉంటాడు.
వచ్చే సమాచారాన్ని కూడా సంబంధించి ఆయన ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని ఉంటారు.ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య ఓ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా డిసెంబర్ నెలలో గాని లేకపోతే వచ్చే సంవత్సరం జనవరి నెలలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక శేఖర్ కమ్ములతో సినిమా తర్వాత నాగచైతన్య మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.వీలైతే ఈ సినిమాని ఈ నెలలోనే మొదలు పెట్టబోతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి థాంక్యూ అనే టైటిల్ ఖరారయింది.ఇక అలాగే నాగచైతన్య తమ్ముడు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి మరో కొత్త కథతో సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ తెరకెక్కిస్తారని టాలీవుడ్ టాక్.ఇకపోతే ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోందని సమాచారం.
ఇవే కాకుండా ఇదివరకే క్రేజీ డైరెక్టర్ పరశురామ్ తో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నట్లు ఆఫీషియల్ గా కూడా చేయడం జరిగింది.ఆ సినిమాను కూడా 14రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.
ఇక ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ తో కలిపి నాగచైతన్య 4 ప్రాజెక్టులో చేతిలో పెట్టుకున్నాడు.ఇక రాబోయే రెండు సంవత్సరాల వరకు ఆయనకు సినిమాల లిస్ట్ ఫుల్లుగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో తన భార్య సమంతతో కలిసి చేసిన మజిలీ, అలాగే మేన మామ విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన వెంకీ మామ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాగచైతన్య వరస సినిమా లతో విజయం సాధిస్తాడో లేదో చూడాలి
.