అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ పుష్ప.ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సినిమాపై అంచనాల్ని రోజు రోజుకు పెంచుతూనే ఉంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నాడని హీరోయిన్ రష్మిక చిత్తూరు జిల్లాకు చెందిన పల్లెటూరి అమ్మాయి గా కనిపించబోతుంది అని ఇప్పటికీ క్లారిటీ వచ్చింది.ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంటుందని అది రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రను పోలి ఉంటుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆ పాత్రను టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తో చేయించేందుకు సుకుమార్ చర్చలు జరుపుతున్నారట.రంగమ్మత్త పాత్రను మించి ఆ పాత్ర ఉంటుందని అందుకే సీనియర్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేరళ లోని ప్రముఖ అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కాని కరోనా కారణంగా దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది.ఇప్పుడు మళ్లీ అదే అడవుల్లో షూటింగ్ నిర్వహించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇప్పటికే ఆలస్యం అయిన కారణంగా ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి విడుదలకు రెడీ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.
అందుకు అల్లు అర్జున్ కూడా రెడీగా ఉన్నాడు.అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ఇప్పటికే కమిట్ అయ్యాడు సినిమా కోసం చాలా స్పీడ్ గా చేయాలని భావిస్తున్నాడు.