మిస్టర్ కూల్ గా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ఘనత సొంతం చేసుకున్న ఆటగాడు, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా దేశానికి ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ధోని ఆటగాడిగా కూడా అదే స్థాయిలో తమ ప్రభావం చూపించగలిగాడు.
గ్రౌండ్ లో కూల్ గా ఉంటూ ప్రత్యర్థికి చెమటలు పట్టించే ధోనీ కెప్టెన్సీ శైలికి చాలా మంది ఫిదా అయిపోయారు.అలంటి మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పేశాడు.
ఇక క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఓ వెబ్ సిరీస్ ను ధోని నిర్మించబోతున్నాడు.
ఈ విషయాన్నీ ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అతడి భార్య సాక్షి వెల్లడించింది.ఈ వెబ్ సిరీస్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోందని తెలియజేసింది.
ఓ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నామన్నారు.ఇది ఓ పురాతన సైన్స్ ఫిక్షన్ కథ అని, ఒక రహస్యమైన అఘోరి ప్రయాణాన్ని అన్వేషిస్తుందని అన్నారు.
మారుమూల ద్వీపంలో హైటెక్ సదుపాయాలతో సెట్ వేశామని, ఇక ఈ సిరీస్ లో నటించే నటీనటులతో పాటు దర్శకుడిని త్వరలోనే ఖరారు చేస్తామని సాక్షి తెలియచేసారు.మొత్తానికి ధోని తన సెకండ్ ఇన్నింగ్ లో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు అని అర్ధం అవుతుంది.
మరి ఇక్కడ ఎంత వరకు ధోని సక్సెస్ అందుకుంటాడు అనేది చూడాలి.