'సైరా' మరీ అంత నష్టపర్చిందా?

నాన్న ఖైదీ నెం.150 సినిమాతో చరణ్‌ నిర్మాతగా మారాడు.కొణిదెల ప్రొడక్షన్స్‌ అంటూ బ్యానర్‌ ను స్థాపించి వరుసగా సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.మొదటి సినిమాతో దాదాపుగా 35 నుండి 50 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లుగా సమాచారం.

 Saira Movie Getting Loss Profits To Ramcharan,sairanarasimha Reddy, Chiranjeevi,-TeluguStop.com

మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో దాదాపుగా 150 కోట్లతో ‘సైరా’ సినిమాను చిరుతో చరణ్‌ నిర్మించాడు.ఆ సినిమా ఫలితం దెబ్బ కొట్టడంతో చరణ్‌ కు భారీ నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమాతో వచ్చిన నష్టం కారణంగా ఇప్పుడు ఆచార్య సినిమాను కూడా నిర్మించలేని పరిస్థితిలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సైరా సినిమా మొత్తం బడ్జెట్‌ లో కేవలం 60 శాతం మాత్రమే రాబట్టిందని అంటున్నారు.

అంటే దాదాపుగా 65 నుండి 70 కోట్ల వరకు రామ్‌ చరణ్‌ కు ఆ సినిమా నష్టపర్చిందన్నమాట.ఆచార్య సినిమాను మొదలు పెట్టబోతున్న సమయంకు సైరా విడుదల అవ్వలేదు.

కనుక సోలోగానే నిర్మించేయాలని భావించాడు.అయితే సినిమా బడ్జెట్‌ వ్యవహారం బెడిసి కొట్టడంతో రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమాకు సొంతంగా ఖర్చు చేయలేని పరిస్థి ఏర్పడినదట.

దాంతో నింజన్‌ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా వచ్చాడంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంను నిజం కాదంటూ కొట్టి పారేసేవారు చాలా మంది ఉన్నారు.

చరణ్‌ కు బడ్జెట్‌ విషయంలో ఇబ్బంది ఏంటీ వందల కోట్ల అధిపతి, వేల కోట్ల వ్యాపారాలు ఉన్న ఉపాసన భర్త.అలాంటి చరణ్‌ సైరా నష్టాలతో ఆచార్యను ఎందుకు వదులుకుంటాడు.

ఆయన కేవలం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉండి నిర్మాణ వ్యవహారాలను సగం వరకు నిరంజన్‌ రెడ్డికి అప్పగించాడని మెగా వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube